ఎనిమిదేళ్ల బుడతడు... సైబర్ సెక్యూరిటీ నిపుణుడు!
ఎనిమిదేళ్ల వయసుకే రూబెన్ పాల్ సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం సాధించాడు. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ బాలుడు నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న సైబర్ సెక్యూరిటీ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నాడు. అంతేకాదు, ఇప్పటికే ఈ తరహా నాలుగు సదస్సుల్లో రూబెన్, సైబర్ సెక్యూరిటీపై ఉపన్యాసాలు వినిపించి నిర్వాహకులను మైమరపించాడు.
తాజాగా న్యూఢిల్లీ సదస్సులో ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా రూబెన్ తరహాలోనే ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. "ఏడాదిన్నర క్రితం కంప్యూటర్ పాఠాలు నేర్చకోవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం సొంతంగా ప్రాజెక్టులను రూపొందించుకుంటున్నాను" అని రూబెన్ చెబుతున్నాడు. ఒడిశాకు చెందిన మనోపాల్ 2000 ఏడాదిలో అమెరికాకు వలసపోయారు. ఆయనే తన కొడుకు రూబెన్ పాల్ కు కంప్యూటర్ పాఠాలు నేర్పారు. ప్రస్తుతం యాపిల్ ఐఓఎస్ పై రూబెన్ పనిచేస్తున్నాడని మనోపాల్ చెప్పాడు.